సేవా సంకల్పంతో స్వచ్ఛ హాస్పిటల్.
మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం.
ఎల్కతుర్తి అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఎల్కతుర్తి మండలం
లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ‘స్వచ్ఛ హాస్పిటల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ పరిసరాలను శుభ్రపరిచి, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండటం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లెపాటి మధుకర్, కుడితాడు చిరంజీవి, మండల ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్, చిదురాల వెంకటేష్, కంచర్ల శంకరయ్య, ముషీకే వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, రగోతం రెడ్డి, నాంపల్లి మమత అశోక్, కోడం రమేష్, గణేష్ శ్రీనివాస్, ఠాకూర్ శ్యామ్ సింగ్, కొమ్మ నిరంజన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కనుకుంట్ల రమాచారి, చీరాల రంజిత్ కుమార్, కొమ్మిడి లచ్చిరెడ్డి, హింగే దేవరావు, బిట్ల లింగయ్య, గూడెల్లి శ్రీనివాస్, పెరుగు మధు, పోలు బిక్షపతి, గొర్రె ప్రవీణ్, చిన్న మాధవ్ రావు, పండ్రాల రాజయ్య, తాడూరి నరేంద్ర చారి, గన్నబోయిన నాగరాజు, పోలు శివసేన తదితరులు పాల్గొన్నారు


Comments