సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.

భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు): 

తన ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పలుమార్లు కలిసి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని గురుకుల పాఠశాల స్థలంలో గురువారం డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్ 48 ద్వారా డిగ్రీ కళాశాలను మంజూరు చేసి రూ.8.60 కోట్లను కేటాయించిందన్నారు. ఇందులో రూ.6.10 కోట్లు భవన నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో గురుకుల పాఠశాల భూమిని డిగ్రీ కళాశాల నిర్మాణానికి బదిలీ చేయడం సాధ్యమైందని చెప్పారు. కళాశాల భవన నిర్మాణాన్ని 2027 ఆగస్టు 1 నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత పాఠశాల, రూ.9.90 కోట్లతో తెలంగాణ పబ్లిక్ పాఠశాల మంజూరైనట్లు పేర్కొన్నారు. ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్రంలోనే ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతామని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.IMG-20261001-WA0047

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.