మహాజన సోషలిస్టు పార్టీ మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
* అధ్యక్షురాలిగా చిలుమల మనోహర..
* ఉపాధ్యక్షురాలిగా మైస రజిత
జమ్మికుంట, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల మహాజన సోషలిస్టు పార్టీ మహిళా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఇన్‌చార్జి తునికి వసంత్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు, సూచనల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
మండల మహిళా అధ్యక్షురాలిగా చిలుమల మనోహర, ఉపాధ్యక్షురాలిగా మైస రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా అల్లూరి మౌనిక, గుల్లి తిరుమల, గుల్లి ప్రియాంక, మైసా చిలకమ్మ, రాగుల ఓదమ్మ, గాజుల లక్ష్మి, బుర్ర రాజేశ్వరి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ జాతీయ నాయకులు రుద్రావరపు రామచంద్రం మాదిగ, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ, మహిళా విభాగం కన్వీనర్ బొద్దుల వాణి మాదిగ, కరీంనగర్ టౌన్ అధ్యక్షురాలు బొద్దుల దివ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా మండల, జిల్లా, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం వంటి అంశాలపై భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అలాగే అక్టోబర్ 2న కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న మద్యపాన నిషేధ ధర్నాను విజయవంతం చేయాలని మహిళా కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments