విద్యాధికారి మంజులతకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.
పెద్దమందడి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందించిన మంజులత ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమందడి మండలానికి చెందిన జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొని మంజులతకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. విద్యారంగానికి మంజులత అందించిన సుదీర్ఘకాల సేవలు అభినందనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి, విద్యారంగ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం మంజులత సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.అనంతరం మంజులతను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంజులత మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం విద్యారంగానికి సేవలందించడం ఎంతో సంతోషంగా ఉందని, తన విధి నిర్వహణలో ఉపాధ్యాయులు, సహచరులు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వెంకట్ గౌడ్, గోపి, బండి రాజు, బజా శేఖర్, మన్నెం, మహేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.


Comments