మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ సదస్సు.

మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!

హుజురాబాద్,సెప్టెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు ):

మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎక్సైజ్ అధికారులు విద్యార్థులకు సూచించారు. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సుగుణ అధ్యక్షతన ‘నశాముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతాయని వివరించారు.
ఎక్సైజ్ ఎస్‌ఐ సురేష్ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం వల్ల ఎదురయ్యే సామాజిక సమస్యలు, చట్టపరమైన శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమకంటే పెద్దవారితో అనవసర స్నేహాలు చేయకుండా, చెడు వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ దశలో మంచి అలవాట్లను అలవర్చుకుని విద్య, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆబాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.