అభివృద్ధి పనులకు శ్రీకారం.

అభివృద్ధి పనులకు శ్రీకారం.

*19, 49వ డివిజన్లలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన*

కరీంనగర్, సెప్టెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు ): 

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచారు. మంగళవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి 19, 49వ డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

49వ డివిజన్ విద్యానగర్‌లో కార్పొరేటర్ ఎన్నం లక్ష్మీ ప్రకాష్‌తో కలిసి నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 19వ డివిజన్ హరిహరనగర్‌లో కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణగౌడ్‌తో కలిసి రూ.20 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.