ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్.
వనపర్తి,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎరుకల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, విద్య, ఉపాధి, నివాసం తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఎరుకల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మంగరాయి వెంకటేష్ కోరారు. ఎరుకల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి సమస్యలను విన్నవించారు.అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను మంగరాయి వెంకటేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎరుకల సంక్షేమ సంఘం తరఫున తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎరుకల సంక్షేమం, అభివృద్ధి కోసం భవిష్యత్‌లోనూ సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని మంగరాయి వెంకటేష్ పేర్కొన్నారు.


Comments