వెల్టూర్ కు పబ్లిక్ స్కూల్ మంజూరు పట్ల హర్షం.

మంత్రులు, ఎమ్మెల్యేకు టీడీపీ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు.

వెల్టూర్ కు పబ్లిక్ స్కూల్ మంజూరు పట్ల హర్షం.

పెద్దమందడి,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం పట్ల పెద్దమందడి టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి వెల్టూర్ కు విచ్చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి  శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గ్రామానికి పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడంతో విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇదే సందర్భంగా వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటు, మండల కేంద్రం హామీతో వెల్టూర్ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.