సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.

రైతుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యం.

సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.

  సైదాపూర్,సెప్టెంబర్ 29( తెలంగాణ ముచ్చట్లు ):

సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లిలో నూతన రైతు సంఘాన్ని ఏర్పాటు చేశారు. రైతుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం గ్రామానికి చెందిన రైతులు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా సంపత్ సంజీవ రెడ్డి, అధ్యక్షుడిగా కొనుపుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా చెన్నబోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గొడుగు బాబు, కోశాధికారిగా సయ్యద్ సర్దార్, కార్యదర్శిగా జెల్ల మొగిలి, సహకార కార్యదర్శిగా గొట్టె రమేశ్ను ఎన్నుకున్నారు.

అలాగే మరో ఏడుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రైతుల సంక్షేమం కోసం సంఘం పనిచేస్తుందని సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.