ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.

ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లను కలిసిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 7న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న సమాచార హక్కు చట్టం–2005 ఆవిర్భావ దినోత్సవం, అవగాహన సదస్సుకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లను ఆహ్వానించారు.
కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి సమాచార కమిషనర్లను కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 7న నిర్వహించనున్న సదస్సు ఉద్దేశాలు, కార్యక్రమ ప్రణాళిక, ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

రాష్ట్ర సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, పి.వి. శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మెర్ల వైష్ణవిలను కలిసి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు.సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తమ సమాచార హక్కుపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజలు తమ హక్కులను చట్టబద్ధంగా వినియోగించుకునేలా చైతన్యం కల్పించడం సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

అక్టోబర్ 7న జరిగే సదస్సులో జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామ స్థాయి ప్రతినిధులతో పాటు సమాచార హక్కు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలు, ప్రజల భాగస్వామ్యం, సమాచార హక్కు వినియోగంపై అవగాహన తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి రావుల నవీన్‌కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ. శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌రామ్‌సింగ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి షాదుల్ తదితరులు పాల్గొన్నారుIMG-20260929-WA0040

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.