సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.

*హుజురాబాద్‌లో దిష్టిబొమ్మ దగ్ధం.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్*

హుజురాబాద్, సెప్టెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ హుజురాబాద్ పట్టణ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేవుళ్లను, ప్రాంతాలను విభజిస్తూ మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ, వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని బీజేపీ నాయకులు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి తిప్పబత్తిని రాజు, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, అంకటి వాసు, యంసాని శశిధర్, పట్టణ ఉపాధ్యక్షులు యల్ల సంజీవరెడ్డి, ఓడ్నాల విజయ్, పట్టణ కార్యదర్శులు గుర్రం సంతోష్, కొడిమ్యాల పవన్ కుమార్, బొడిగె రాధ, పట్టణ కోశాధికారి క్యాష వెంకటేష్, గంధం అనిల్, తూర్పాటి రామచంద్రం, పురాణం కృష్ణయ్య, తూర్పాటి సురేష్, నీలం రవీందర్, పురాణం రాజు, పర్ధం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.