నీట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థినికి రావుల రూ.25 వేల ఆర్థికసాయం.

నీట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థినికి రావుల రూ.25 వేల ఆర్థికసాయం.

కొత్తకోట,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ సీటు పొందిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినికి మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి రూ.25 వేల ఆర్థికసాయం అందజేశారు.కానాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ యువ నాయకుడు కావాలి రవి కుమార్తె ఇటీవల నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం రూ.25 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు పలుస శంకర్‌గౌడ్, కానాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్, సర్పంచ్ భర్త సాయిలు, గ్రామ అధ్యక్షుడు హోటల్ రాజు, సీనియర్ నాయకులు శేఖర్‌గౌడ్, రవీందర్‌గౌడ్, శ్రీనివాసులు సాగర్, ఉపాధ్యాయులు శివనారాయణ, ధనుష్, హరిబాబు, కృష్ణయ్య, మన్యం, చందు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.