టీఎస్‌ఈఈయూ-327 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.
ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్.
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎస్‌ఈఈయూ-327 సంఘం క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని విద్యుత్ విభాగ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఘన్‌పూర్ విభాగ కార్యవర్గ సభ్యులను డీఈ బి.సారయ్యకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా బి.సారయ్య మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. సీఎండీ ప్రవేశపెట్టిన ‘ఒక నిమిషం నిబంధన’ను పాటిస్తూ విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
అనంతరం ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతం 327 సంఘానికి కంచుకోటగా ఉందన్నారు. పీఆర్సీతో పాటు ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీతో కలిసి పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈపీఎఫ్ పరిధిలోని ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేయించేందుకు సంజీవరెడ్డి నేతృత్వంలో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలం ఐలేష్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాస్, సంఘటిత కార్యదర్శి ప్రశాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బి.వీరాంజనేయులు, కార్యదర్శి సీహెచ్.నరేందర్‌రెడ్డి, సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.రాజ్‌కుమార్, జనగామ విభాగ అధ్యక్షుడు ఎం.మహేందర్, కార్యదర్శి కె.విజయ్‌కుమార్, ఘన్‌పూర్ విభాగ నూతన అధ్యక్షుడు వాసం శ్రీధర్, కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్, కోశాధికారి జి.కృష్ణంరాజు, సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.సందీప్, కార్యనిర్వాహక అధ్యక్షులు డి.సాంభరాజు, బి.శరత్, ఉపాధ్యక్షులు ఎస్.అర్చన, వి.ప్రభాకర్, ఎం.వెంకన్న, ఎస్.రమ్య, అదనపు కార్యదర్శి ఎన్.గిరి, సంయుక్త కార్యదర్శి ఎ.సుధాకర్, కార్యాలయ కార్యదర్శి ఎం.మహేందర్, 327 ట్రాన్స్‌కో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతకోటి మల్లేష్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, వీరస్వామి, లక్ష్మి, లక్ష్మణ్, వెంకటేష్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.


Comments