పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.

జమ్మికుంట, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా, సుందరంగా ఉంచేందుకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సందర్శించి వైద్య పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య శిబిరంలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఒకరి ఆరోగ్యంపై వారి కుటుంబం ఆధారపడి ఉంటుందని, అందువల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
విధులు నిర్వహించే సమయంలో పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలని చైర్మన్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మొలుగు చందన, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.IMG-20260929-WA0045

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.