రైతుల సంక్షేమమే సహకార సంఘం లక్ష్యం.

రైతుల సంక్షేమమే సహకార సంఘం లక్ష్యం.

రుణ బకాయిలు సకాలంలో చెల్లించాలి

 -- విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దమందడి సింగిల్ విండో అధ్యక్షులు

పెద్దమందడి,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘం పనిచేస్తుందని వనపర్తి జిల్లా పెద్దమందడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పెద్దమందడి సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు తదితర సేవలను సకాలంలో అందించేందుకు సహకార సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సహకార సంఘం బలోపేతానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు.రైతులు సహకార సంఘం నుంచి తీసుకున్న రుణ బకాయిలను సకాలంలో చెల్లించాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. రుణ బకాయిలు పేరుకుపోకుండా సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అలాగే వ్యాపార రుణాలకు సంబంధించిన బకాయిల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.వరి కొనుగోలు ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చించారు. సింగిల్ విండో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వరి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా సంఘం కార్యకలాపాలను మరింత విస్తరించడంతో పాటు సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల అభివృద్ధి, సంఘం పురోగతి పరస్పరం ముడిపడి ఉన్నాయని, రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రతి నిర్ణయం ఉండాలని అన్నారు.సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) సుధాకర్ మాట్లాడుతూ సంఘం కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సభ్యులకు అవసరమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, సీఈవో సుధాకర్, పెద్దమందడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి,సంఘం డైరెక్టర్లు, సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.