వేలేరు ఘటనపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు.. ఐదుగురు బహిష్కరణ.

వేలేరు, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్‌పై ఇటీవల జరిగిన దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఐదుగురిని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించినట్లు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు.
లక్ష్మణ్ నాయక్‌పై జరిగిన దాడికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన సెప్టెంబర్ 25న అధికారికంగా ఫిర్యాదు చేయగా, ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను హనుమకొండ డీసీసీ టీపీసీసీకి పంపింది. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం పార్టీ క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ నిర్ణయించింది.
బహిష్కరణకు గురైన వారిలో డీసీసీ కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సద్దాం హుస్సేన్, మాజీ వార్డు సభ్యుడు భైరి అనిల్, 14వ వార్డు సభ్యుడు అందె కృపా సాగర్, పార్టీ కార్యకర్త కుర్సపెల్లి హరీష్, మాజీ సోషల్ మీడియా మండల ఇన్‌చార్జ్ మహమ్మద్ సలీం మాలిక్ ఉన్నారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, క్రమశిక్షణను ఉల్లంఘించి అరాచకాలకు పాల్పడే వారిపై ఎంతటి స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.