రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

స్టేషన్ ఘన్‌పూర్‌లో మజ్దూర్ యూనియన్ ఆందోళన.

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

రైల్వే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో కార్మికులు ఆందోళన నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఇంజినీరింగ్ విభాగం కార్యదర్శి ఇల్లందుల రాజేందర్ ఆధ్వర్యంలో పనిముట్ల గదుల వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ట్రాక్ నిర్వహణ కార్మికుల గస్తీని 12 కిలోమీటర్లకు పరిమితం చేయాలని, కీమెన్లకు అదనపు విధులు అప్పగించవద్దని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న అదనపు పని భత్యం, ప్రయాణ భత్యం, సెలవుల నగదీకరణ, పిల్లల విద్యా భత్యాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

రాత్రి గస్తీ విధులకు ఇద్దరు పెట్రోల్‌మెన్‌లను నియమించాలని, పీఎల్‌బీపై ఉన్న రూ.7 వేల పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో చైర్మన్ కొంగర బిక్షపతి, సహాయ కార్యదర్శులు కరుణ, నరసింహస్వామి, దేవయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి. ఎరుకల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి.
వనపర్తి,సెప్టెంబర్‌29(తెలంగాణ ముచ్చట్లు): ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.
ఆర్టీఐ అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం.
దానం నాగేందర్‌పై అనర్హత.. ప్రజాస్వామ్యం గెలిచింది.
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన.
మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు!
సర్వాయిపేటలో నూతన రైతు సంఘం ఏర్పాటు.