పేదల సొంతింటి కలకు ప్రజా ప్రభుత్వం భరోసా.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ.
Views: 0
On
చొప్పదండి, సెప్టెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు ):
నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కొడిమ్యాల మండల ఎంపీడీవో కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందిస్తూ, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని తెలిపారు. సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Sep 2026 21:18:48
వనపర్తి,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
ఎస్టీల సమస్యల పరిష్కారంపై వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను ఎరుకల సంక్షేమ సంఘం...


Comments