బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కార్యకర్తల చేరిక.
కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా 20 మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరిక.
చొప్పదండి, సెప్టెంబర్ 30(తెలంగాణ ముచ్చట్లు ):
చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బూరుగుపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలువురు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా పాలన సాగుతోందని విమర్శించిన ఆయన.. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.


Comments