జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.

జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి.

వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తిలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాహితీ సదస్సులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. జాషువా తన రచనల ద్వారా కుల వివక్ష, అస్పృశ్యత, అసమానతలను ప్రశ్నించి సామాజిక చైతన్యానికి బాటలు వేశారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కుల, వర్ణ వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని, మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి అన్నారు. ఆచార్య కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ జాషువా 20వ శతాబ్దాన్ని మలుపు తిప్పిన మహాకవి అని, పేదరికం, కులమత వివక్ష, అంటరానితనం వంటి అవరోధాలను ఎదుర్కొంటూనే తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని వివరించారు. ‘గబ్బిలం’ సహా 33 లఘు కావ్యాలు, పలు సామాజిక రచనల ద్వారా కుల నిర్మూలన, స్త్రీ విముక్తి, అస్పృశ్యత వంటి అంశాలను ప్రస్తావించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వచన కవి మరికంటి నరసింహకు జాషువా పురస్కారం అందజేశారు. పలుస శంకర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బైరోజు చంద్రశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, పలువురు సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి. జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి.
వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తిలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాహితీ సదస్సులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రధాన...
సమ్మిరెడ్డి మాతృమూర్తికి కర్ర సోమిరెడ్డి నివాళి.
విద్యాధికారి మంజులతకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.
మహాజన సోషలిస్టు పార్టీ మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు.
ఫ్లెక్సీల మాటున మహాత్ముడు.
పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.