విద్యారంగానికి మంజులత సేవలు చిరస్మరణీయం.

ఘనంగా పెద్దమందడి మండల విద్యాధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమం.

విద్యారంగానికి మంజులత సేవలు చిరస్మరణీయం.

పెద్దమందడి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా విధులు నిర్వహించిన మంజులత ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ మండలాల విద్యాధికారులు, తోటి ఉపాధ్యాయులు హాజరై మంజులతకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యారంగానికి మంజులత అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆమె సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.అనంతరం మంజులత మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం విద్యారంగానికి సేవలందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన విధి నిర్వహణలో ఉపాధ్యాయులు అందించిన సహకారం మరువలేనిదని, వారి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగానని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీని అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని మంజులతను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి. జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి.
వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తిలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాహితీ సదస్సులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రధాన...
సమ్మిరెడ్డి మాతృమూర్తికి కర్ర సోమిరెడ్డి నివాళి.
విద్యాధికారి మంజులతకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.
మహాజన సోషలిస్టు పార్టీ మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు.
ఫ్లెక్సీల మాటున మహాత్ముడు.
పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.