తెలంగాణ ముచ్చట్లు కథనానికి అధికారుల స్పందన.
కథనం ఫలితం.. పాఠశాల బోర్డుకు పటిష్ట ఏర్పాట్లు.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రవేశద్వారం వద్ద ప్రమాదకరంగా వేలాడుతున్న పాఠశాల బోర్డుపై తెలంగాణ ముచ్చట్లులో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. పాఠశాల బోర్డు ప్రమాదకర స్థితిలో ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు.
కథనం ప్రచురితమైన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల బోర్డును పరిశీలించారు. అనంతరం బోర్డుకు పటిష్ట ఏర్పాట్లు చేసి ప్రమాదం జరిగే అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. దీంతో పాఠశాల ప్రవేశద్వారం వద్ద నెలకొన్న ప్రమాదకర పరిస్థితి తొలగిపోయింది. అధికారుల తక్షణ చర్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఊరట లభించింది.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిర్వహించాలంటే విద్యాబోధనతో పాటు పాఠశాల పరిసరాలు, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. పాఠశాలల్లో తలెత్తే చిన్నపాటి సమస్యలను సైతం సకాలంలో గుర్తించి పరిష్కరిస్తే విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చని స్థానికులు పేర్కొన్నారు.
పాఠశాల బోర్డు ప్రమాదకరంగా ఉన్న విషయాన్ని తెలంగాణ ముచ్చట్లు కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించిందని స్థానికులు తెలిపారు. కథనానికి స్పందించి వెంటనే చర్యలు చేపట్టిన అధికారులకు వారు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి దోహదపడుతున్న తెలంగాణ ముచ్చట్లుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


Comments