పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

మోజర్లలో పౌర హక్కుల దినోత్సవం.

పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

వనపర్తి,సెప్టెంబర్30(తెలగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల పరిధిలోని మోజర్ల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కే. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మండల తహసీల్దార్ మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. అంటరానితనం నిర్మూలన, పౌర హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.పోలీసు శాఖ అధికారులు మాట్లాడుతూ.. గ్రామాల్లో అనుకోకుండా గొడవలు జరిగినప్పుడు కులం పేరుతో దూషించడం, దాడులకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని తెలిపారు. గ్రామస్తులు పరస్పరం సోదరభావంతో మెలగాలని, వ్యవసాయ పొలాలు, గ్రామాలు, పండుగల సందర్భాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు.జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల కారణంగా బాధిత కుటుంబాలతో పాటు నిందితుల కుటుంబాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గ్రామంలో ముందస్తుగా సమాచారం ఇచ్చి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల హాజరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై చట్టాలు, తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాయికంటి రాములు యాదవ్, గోపాల్‌రావు, పంచాయతీ కార్యదర్శి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి. జాషువా ఆశయాల సాధనకు సాహిత్యం దోహదం చేయాలి.
వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తిలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాహితీ సదస్సులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రధాన...
సమ్మిరెడ్డి మాతృమూర్తికి కర్ర సోమిరెడ్డి నివాళి.
విద్యాధికారి మంజులతకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.
మహాజన సోషలిస్టు పార్టీ మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు.
ఫ్లెక్సీల మాటున మహాత్ముడు.
పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.