సమ్మిరెడ్డి మాతృమూర్తికి కర్ర సోమిరెడ్డి నివాళి.
Views: 0
On
ధర్మసాగర్,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు సమ్మిరెడ్డి మాతృమూర్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ధర్మసాగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ కర్ర సోమిరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కరుణాపురం గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు రాజారపు సుమన్, మండల సీనియర్ నాయకుడు భైరపాక బాలస్వామి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Sep 2026 20:46:12
వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తిలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాహితీ సదస్సులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రధాన...


Comments