ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు.
నారాయణ పాఠశాలలో ఘనంగా ఎస్‌ఎల్‌సీ.
వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఈ-కిడ్స్, ఈ-చామ్స్ ఆధ్వర్యంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్‌ఎల్‌సీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించగా, అవి ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఈ-కిడ్స్ ఆర్‌అండ్‌డీ సంగీత, ఏజీఎం వెంకటరెడ్డి, డీజీఎం వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఎస్‌ఎల్‌సీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భయేందర్‌గౌడ్, కోఆర్డినేటర్లు మాధురి, రీనా, వైస్ ప్రిన్సిపాళ్లు రవళి, షర్ణిక, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Comments