తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.

తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.

పంచాయతీ ఆవరణలో గ్రామ పటం ప్రదర్శన

ఉపాధి హామీ పథకంలో నూతన మార్పులపై వివరణ

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సామాజిక పట కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మంతెన హరిత ఇంద్రారెడ్డి గ్రామస్తులకు సామాజిక పటం ద్వారా గ్రామంలోని వనరులు, అభివృద్ధి పనుల వివరాలను వివరించారు.అనంతరం ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్‌జీ’ పథకం లక్ష్యాలు, ఉపాధి దినాలు, కూలీలకు కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇఫ్తాకర్, ఉపసర్పంచ్ గాదె శాంత భాస్కర్, వార్డు సభ్యులు మంతెన మౌనిక, కృష్ణం రాజు, ఉబ్బని నవీన్, చుక్క రేణుక, రజిత, గుండె రంజిత్, బాస్కుల జై, ఫీల్డ్ అసిస్టెంట్ కవిత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.