సొసైటీ సభ్యుల కుటుంబాలకు భరోసా.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన చైర్మన్ గోపు మల్లారెడ్డి.
Views: 0
On
తిమ్మాపూర్, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు ):
మండలంలోని పోరండ్ల సొసైటీ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన సంఘం సభ్యులు జాప మల్లారెడ్డి, కంది నరసింహారెడ్డి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలను పరామర్శించిన సొసైటీ చైర్మన్ గోపు మల్లారెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ గోపు మల్లారెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ సభ్యుల కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం సొసైటీ బాధ్యత అని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శ్రీనివాస్, అంజిరె
డ్డి, ఐతం వెంకన్న, సొసైటీ సభ్యులు, మృతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Oct 2026 20:50:06
జవహర్‌నగర్, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాల పేరుతో వాస్తవాలకు విరుద్ధమైన కథనాలు ప్రచురిస్తూ, తోటి విలేకరుల...


Comments