కాంగ్రెస్ లో భారీగా చేరికలు.

కాంగ్రెస్ లో భారీగా చేరికలు.

* ఖమ్మం రూరల్ మండలం ఎంవీ.పాలెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు, కేశవాపురం గ్రామాల నుంచి 50కుటుంబాలు చేరిక 
* బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీల నుంచి వలస
* కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి 

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు )

పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారు. వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఖమ్మం రూరల్ మండలం ఎంవీ. పాలెంకు చెందిన సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీలకు చెందిన 25 కుటుంబాల వారు, తిరుమలాయపాలెం మండలంలోని కేశ్వాపురం, పిండిప్రోలు గ్రామాల నుంచి బీఆర్ఎస్, సీపీఎం, ఎంఎల్ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు.. మొత్తం 50 కుటుంబాల వారు ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు. వీరికి మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిండిప్రోలు గ్రామాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, మంత్రి పొంగులేటి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్లు పూర్తిచేయిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. పొంగులేటి నాయకత్వాన్ని నచ్చి, మెచ్చి, అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ గూటికి చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, పార్టీలో చేరిన వారందరికీ నిరంతరం అండగా నిలుస్తామని అభయమిచ్చారు.
*ఈ కార్యక్రమాల్లో..:* పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు తోట వీరభద్రం, కొప్పుల అశోక్, మాజీ ఎంపీపీ మంగీలాల్, మందపల్లి నాగమణి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు దూదిమెట్ల వెంకట్, నాయకులు దొడ్డా గురవయ్య, షేక్ సలీం, రాయండ్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.