విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి .
-- పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత ఉద్యోగులు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ సేవకు తమ వంతు కృషి చేయాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన కొండ మంజులతను గురువారం వనపర్తిలోని ఆమె స్వగృహంలో సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులు ప్రజా ప్రయోజన అంశాలపై అవగాహన పెంచుకుని సామాజిక సేవలో భాగస్వాములు కావాలని కోరారు. కొండ మంజులత 37 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా, మండల విద్యాశాఖాధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి అధికారుల, ప్రజాప్రతినిధుల ప్రశంసలు, సన్మానాలు పొందారని గుర్తుచేశారు.ఉద్యోగ విరమణ అనంతరం తన తీరిక సమయాన్ని మహిళల అభ్యున్నతికి కేటాయించి సేవ చేయాలనే ఆకాంక్షను శంకర్ గౌడ్ వ్యక్తం చేశారు. అనంతరం మంజులతను శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో సాహితీ కళా వేదిక ప్రతినిధులు కందూరు నారాయణరెడ్డి, మండల విద్యాశాఖాధికారులు మద్దిలేటి, శివప్రసాద్, బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments