పెద్దమందడి మండల విద్యాధికారిగా శాంతన్న.
విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని వెల్లడి.
పెద్దమందడి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా శాంతన్న బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో పరిణత ఆధ్వర్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాంతన్న పెద్దమందడి జెడ్పీహెచ్‌ఎస్‌లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.మండలంలోని పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని శాంతన్న తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.


Comments