కాజీపేట్ వై ఎస్ ఆర్ నగర్ వాసులకు ప్రభుత్వం పట్టాలి ఇవ్వాలి .

కాజీపేట్ వై ఎస్ ఆర్ నగర్ వాసులకు ప్రభుత్వం పట్టాలి ఇవ్వాలి .

కాజీపేట్ అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు)

కాజీపేట్ వైయస్సార్ నగర్ లో 22 సంవత్సరాల నుండి నివసిస్తున్న గుడిసేవాసులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి పట్టాలు ఇవ్వాలని వైయస్సార్ వీకర్ సెక్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీపేటలో గురువారం  ర్యాలీనీ నిర్వహించారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ భారీగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అంకుష్, పసునూరి మనోహర్ లు మాట్లాడుతూ కాజీపేట వైయస్సార్ నగర్ లో సుమారు 22 ఏళ్లుగా పేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని వారు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వమే ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు ఇంటి నెంబర్లు ఓటర్ ఐడి కార్డులు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఇచ్చారని వారి పేర్కొన్నారు. సర్వేనెంబర్ 69 ,70, 71 ,72  ,73 పరిధిలోని భూమికి సంబంధించిన పేదలు ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని వారు తెలిపారు .గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో వైయస్సార్ నగర్ గా నామకరణం చేసి అప్పటి కార్పొరేటర్ రావుల సదానందం నాయకత్వంలో సుమారు వందల కుటుంబాలు ఇక్కడ నివాస ఏర్పరచుకున్నాయని వాళ్ళు తెలిపారు.  ఈ భూమిపై కన్నేసి కొందరు పేదలను భయప్రాంతులకు గురి చేస్తూ గుడిసెలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. పేదల గుడిసెలను తొలగించే ప్రయత్నలను వెంటనే విరమించుకోవాలని వారు హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వం లేదా సి ల్లింగ్ భూముల్లో ఏళ్ల తరబడి  నివాసం ఉంటున్న పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి పట్టాలు కల్పించి ఇల్లు చేకూరుస్తా మని ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే కార్యక్రమం లో భాగంగా స్థిర నివాస స్థలాలు లేని పేదలకు ప్రభుత్వం భూమి సమకూర్చి లేదా అవసరమైతే భూమిని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ కోరినట్లు వారు తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని వారు తెలిపారు. పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పేదలపై ఒత్తిడి తీసుకురావడం మరి నివాసం తొలగించేందుకు ప్రయత్నించిన వంటి చర్యలను కబ్జాదారులు వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పేదల న్యాయమైన హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను కొనసాగించితే చట్టపరమైన రాజ్యాంగబద్ధంగా పేదరాకుల కోసం ఎంత దూరమైన పోరాటం చేసే న్యాయాన్ని సాధించుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కొరిపాక బిక్షపతి గుమ్మల రవి, రావుల దయాసాగర్, బన్న సాంబయ్య, శనగరపు సతీష్, మహమ్మద్ యాసిన్, రజాక్ ,పాషా రషీద్, గౌతమ్, అర్జున్, సాయి ,నీరటి పావని, కాదాసీ సులోచన, శనిగరపు లక్ష్మి, భవాని అభిజ్ఞ, సునీత ,పుష్ప,  రవి, పరపల్లి  సుభాస్తిన్, ఏలియా లతోపాటు తదితరులుపాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ప్రత్యేక చొరవ. ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
పెద్దమందడి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు) ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామ సర్పంచ్‌ పలుస శ్రీనివాస్‌ గౌడ్‌ గ్రామంలోని 3వ, 4వ...
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సన్నద్ధం.
ప్రజా సేవే లక్ష్యంగా.. నవ భారత నిర్మాణమే ధ్యేయంగా.
సొసైటీ సభ్యుల కుటుంబాలకు భరోసా.
పెద్దమందడి మండల విద్యాధికారిగా శాంతన్న.
వనపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.20 కోట్ల సాయం.
కాజీపేట్ వై ఎస్ ఆర్ నగర్ వాసులకు ప్రభుత్వం పట్టాలి ఇవ్వాలి .