ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సన్నద్ధం.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సన్నద్ధం.

అక్టోబర్‌ 13 నుంచి నిరవధిక సమ్మె

-- జిల్లా కోఆర్డినేటర్‌ కాజా హుస్సేన్‌

వనపర్తి,అక్టోబర్‌01(తెలంగాణ ముచ్చట్లు):

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ కాజా హుస్సేన్‌ తెలిపారు. సమ్మెకు సంబంధించిన నోటీసును వనపర్తి జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభికి అందజేశారు. అదేవిధంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)కు కూడా సమ్మె నోటీసును అందజేసినట్లు తెలిపారు.సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 12 వరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి, అక్టోబర్‌ 13 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేడర్లలో సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను, కుటుంబ సభ్యుల భద్రతను సైతం పక్కనపెట్టి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించారని గుర్తుచేశారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, సమ్మెకు దారితీసిన పరిస్థితులను నివారించాలని కాజా హుస్సేన్‌ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తప్పుడు కథనాలకు చెక్‌ పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించిన జేఎంసీ విలేకరులు. తప్పుడు కథనాలకు చెక్‌ పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించిన జేఎంసీ విలేకరులు.
జవహర్‌నగర్‌, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాల పేరుతో వాస్తవాలకు విరుద్ధమైన కథనాలు ప్రచురిస్తూ, తోటి విలేకరుల...
మూడేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
బాలల ఆన్‌లైన్ రక్షణకు మరింత బలమైన చర్యలు అవసరం.
బీసీ రక్షణ చట్టం తేవాలి.
రూ. 200 కోట్లతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు.
పలు కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ.
కాంగ్రెస్ లో భారీగా చేరికలు.