కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

*తీగలగుట్టపల్లిలో రూ.65.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన*

*యూఐడీఎఫ్ ద్వారా మరో రూ.30 కోట్ల నిధులతో పనులకు చర్యలు: బండి సంజయ్*

కరీంనగర్, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు ):

నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లతో కలిసి ఆయన పర్యటించారు.

మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లోని చంద్రపురి కాలనీలో యూఐడీఎఫ్ నిధులు రూ.65.30 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. నూతన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యలు, రవాణా ఇబ్బందులు తొలగుతాయని బండి సంజయ్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. యూఐడీఎఫ్ ద్వారా మరో రూ.30 కోట్ల నిధులతో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పంపిన చంద్ర, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, గాజ రమ శివరాం, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, మాసం గణేష్, సాధినేని లావణ్యతో పాటు స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ప్రత్యేక చొరవ. ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
పెద్దమందడి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు) ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామ సర్పంచ్‌ పలుస శ్రీనివాస్‌ గౌడ్‌ గ్రామంలోని 3వ, 4వ...
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సన్నద్ధం.
ప్రజా సేవే లక్ష్యంగా.. నవ భారత నిర్మాణమే ధ్యేయంగా.
సొసైటీ సభ్యుల కుటుంబాలకు భరోసా.
పెద్దమందడి మండల విద్యాధికారిగా శాంతన్న.
వనపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.20 కోట్ల సాయం.
కాజీపేట్ వై ఎస్ ఆర్ నగర్ వాసులకు ప్రభుత్వం పట్టాలి ఇవ్వాలి .