అమిత్ షా పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు.
అక్టోబర్ 4న ప్రతిమా మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు.
కరీంనగర్, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు ):
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న కరీంనగర్‌లోని ప్రతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సై
న్సెస్‌లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరిశీలించారు.
ప్రతిమా గ్రూప్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్, సిల్వర్ జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ స్థలం, ప్రతిమా డీమ్డ్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే ప్రదేశం, ఫొటో ఎగ్జిబిషన్, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే వేదిక తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయనను ఘనంగా స్వాగతించేందుకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.


Comments