ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకంలో రొటేషన్ పద్ధతి పాటించాలి.

ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకంలో రొటేషన్ పద్ధతి పాటించాలి.

మాదిగ,అనుబంధ కులాల జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి

-తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్ 

హైదరాబాద్,అక్టోబర్1(తెలంగాణ ముచ్చట్లు):

 తెలంగాణ ఎస్సీ-ఎస్టీ కమిషన్ ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 3, 2026తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి కమిషన్ చైర్మన్ నియామకంలో రొటేషన్ విధానాన్ని పాటించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం (టీఎంజేఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. 
మాదిగ,అనుబంధ కులాల జర్నలిస్టులకు కమిషన్‌లో ప్రాధాన్యత కల్పించాలని ఫోరం వ్యవస్తాపాక రాష్ట్ర అధ్యక్షుడు భూర్గుల నాగేందర్ మాదిగ, గౌరవ అధ్యక్షులు వత్తుల రఘుపతి మాదిగ, ప్రధాన కార్యదర్శి బొల్లెపాక రాజేష్ మాదిగ డిమాండ్ చేశారు.ఈ మేరకు వారు గురువారం హైదర్ గూడ లోని ఎన్ ఎస్ ఎస్ మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి,మంత్రిమండలి, కృషి చేసిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.గతంలో కమిషన్‌కు కల్పించిన ప్రాతినిధ్యాన్ని సమీక్షించి, ఒకే ఉపకులం లేదా ప్రాంతానికే పరిమితం కాకుండా మాదిగ, మాలలతో పాటు అన్ని ఎస్సీ కులాలు, ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.కమిషన్ నియామకంలో మాదిగ,అనుబంధ కులాల జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న జర్నలిస్టులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.కుల అణచివేత, కుల వివక్ష నిర్మూలనపై దూరదృష్టి,సామాజిక సమస్యలపై అవగాహన ఉన్నవారికి కమిషన్‌లో అవకాశం కల్పించాలని అన్నారు.కుల వివక్ష, కుల బహిష్కరణ,సామాజిక వెలివేత,గ్రామస్థాయి ఘర్షణలు ముదిరిన తర్వాత స్పందించకుండా,ముందుగానే సమస్యలను గుర్తించి నివారించే కార్యాచరణ ఉండాలని కోరారు.
ముఖ్యంగా ఎస్సీ–బీసీ కులాల మధ్య ఘర్షణలకు దారితీసే సమస్యలను సంభాషణ, అవగాహన,చట్టపరమైన చర్యల ద్వారా పరిష్కరించే విధంగా కమిషన్ పనిచేయాలని  అన్నారు.ఈ సమావేశం లో రాష్ట్ర గౌరవ సలహా దారులు మైలారపు ప్రేమ్,సుంచు లింగయ్య, పసుల తిరుపతి, జిలకర కృష్ణాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియం నాగయ్య,దుబ్బ నగేష్,  కార్యదర్శులు చెల్మెడ్ అనీల్,గంట వెంకన్న,మహంకాళి భిక్ష పతి, ప్రచార కార్యదర్శులు కల్మకోల్ యాదయ్య, చింత ప్రవీణ్,కోశాధికారి బొట్ల సదానందం, అధికార ప్రతినిధి పంగిడిచెరువు వెంకటేష్, సహాయ కార్యదర్శి కాడేపగ శ్రీనివాస్, నాయకులు బొల్లె రాజయ్య, దరువుల శంకర్, మీసాల సైదులు, లంక స్వామి, రాయుడు, బాలకృష్ణ, రామస్వామి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సన్నద్ధం. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సన్నద్ధం.
అక్టోబర్‌ 13 నుంచి నిరవధిక సమ్మె -- జిల్లా కోఆర్డినేటర్‌ కాజా హుస్సేన్‌ వనపర్తి,అక్టోబర్‌01(తెలంగాణ ముచ్చట్లు): ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరవధిక...
ప్రజా సేవే లక్ష్యంగా.. నవ భారత నిర్మాణమే ధ్యేయంగా.
సొసైటీ సభ్యుల కుటుంబాలకు భరోసా.
పెద్దమందడి మండల విద్యాధికారిగా శాంతన్న.
వనపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.20 కోట్ల సాయం.
కాజీపేట్ వై ఎస్ ఆర్ నగర్ వాసులకు ప్రభుత్వం పట్టాలి ఇవ్వాలి .
కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.