ప్రజా సేవే లక్ష్యంగా.. నవ భారత నిర్మాణమే ధ్యేయంగా.
*మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా ‘సేవా సంకల్ప్ అభియాన్’*
*తీగలగుట్టపల్లిలో ‘అంగన్ మిలన్ సేవ’లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్*
కరీంనగర్, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు ):
దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా కొనసాగిస్తున్న ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజలకు సేవ చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా సంక్షేమం, దేశ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ
జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments