రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీకి ఎంపికైన క్రీడాకారులకు జెర్సీలు అందజేత.
మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ప్రదానం చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి .
Views: 0
On
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు )
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల రెండో తేదీ నుంచి జరగనున్న జూనియర్ బాలుర, సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు.. గురువారం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జెర్సీలు ప్రదానం చేశారు. పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి.. ఈ సందర్భంగా క్రీడా దుస్తులు అందజేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి శిక్షణ అందుతోందని, ఈ పోటీల్లో ప్రతిభ చాటి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ క్రిస్టఫర్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Oct 2026 21:39:46
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...


Comments