సోలార్‌తో కరెంటు బిల్లుకు చెక్.

సోలార్‌తో కరెంటు బిల్లుకు చెక్.

మిగులు విద్యుత్‌ అమ్మితే ఆదాయం

ఘన్‌పూర్‌లో మూడు రోజుల సేవా సేతు సోలార్‌ అవగాహన సదస్సు

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం పొందవచ్చని ఎన్పీడీసీఎల్‌ ఘన్‌పూర్‌ డీఈ బి.సారయ్య తెలిపారు.స్టేషన్ ఘన్‌పూర్‌ మున్సిపల్‌ పట్టణ కేంద్రంలోని ఎన్పీడీసీఎల్‌ ఉపవిభాగ కార్యాలయంలో సేవా సేతు కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల సౌర విద్యుత్‌ అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఏడీఈ పి.రణధీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఈ సారయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోందన్నారు. సొంత పెట్టుబడి లేకుండానే బ్యాంకు రుణం ద్వారా సౌర విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
మూడు కిలోవాట్ల సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే నెలకు సుమారు 360 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఇంటి అవసరాలకు వినియోగించిన అనంతరం మిగిలిన విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు నగదు చెల్లిస్తుందని వివరించారు.

ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయని, సొంత ఇల్లు, గృహ విద్యుత్‌ సర్వీసు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. సౌర విద్యుత్‌ వినియోగం వల్ల విద్యుత్‌ బిల్లులు తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు.
మూడు రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సులో భాగంగా నేడు, రేపు కూడా కార్యక్రమాలు కొనసాగుతాయని, అర్హులైన వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈ సూచించారు.కార్యక్రమంలో రెడ్కో అధికారులు, యూనియన్‌, డీసీసీ, కెనరా బ్యాంకు అధికారులు, ఏఈలు రవీందర్‌, పి.శంకర్‌, శివకుమార్‌, శ్వేత, ఉప ఇంజనీర్‌ సాధన, విద్యుత్‌ వినియోగదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.