సర్పంచ్‌పై బెల్ట్‌షాప్‌ నిర్వాహకుడి దాడి.

సర్పంచ్‌పై బెల్ట్‌షాప్‌ నిర్వాహకుడి దాడి.

కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదుపోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌ ఫిర్యాదు

స్టేషన్‌ ఘనపూర్,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్‌ ఘనపూర్‌ మండలం విశ్వనాథపురం గ్రామంలో బెల్ట్‌షాప్‌ నిర్వాహకుడి వ్యవహారంపై వివాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ తీర్మానాన్ని ధిక్కరించి మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళా సర్పంచ్‌పై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహించకూడదని సర్పంచ్‌ గుర్రపు యాదమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. తీర్మానం అనంతరం గ్రామంలోని మద్యం విక్రయ కేంద్రాలను మూసివేసినప్పటికీ, గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను మాత్రం కొత్తగా బెల్ట్‌షాప్‌ ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో, రెండు రోజుల క్రితం అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం అందుకున్న సర్పంచ్‌ గ్రామపంచాయతీ సిబ్బంది మధును అక్కడికి పంపినట్లు తెలిపారు. మద్యం విక్రయాల ఫొటోలు తీస్తున్న సమయంలో శ్రీను తనను అసభ్య పదజాలంతో దూషించి బెదిరించాడని మధు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
దీంతో సర్పంచ్‌ యాదమ్మ స్వయంగా అక్కడికి వెళ్లి శ్రీనును ప్రశ్నించగా వివాదం తలెత్తినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు సర్పంచ్‌ ఆరోపించారు. అనంతరం శ్రీనుతో పాటు అతని తండ్రి, ముగ్గురు కుమారులు నవీన్‌, ప్రవీణ్‌, రాజు, భార్య రజిత కలిసి తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భర్త ఎల్లయ్య, కుమారుడు నరేష్‌పై కూడా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై సర్పంచ్‌ యాదమ్మ గురువారం స్టేషన్‌ ఘనపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గ్రామపంచాయతీ తీర్మానాన్ని ధిక్కరించడంతో పాటు మహిళా ప్రజాప్రతినిధిపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.