ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు.

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.

పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతన్న మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పెద్దమందడి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి శాంతన్న కృషి చేయాలని ఆకాంక్షించారు.అనంతరం శాంతన్న మాట్లాడుతూ తనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దమందడి మండలంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన మండలి ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ, ఎమ్మార్పీఎస్‌ వనపర్తి జిల్లా ఇన్‌చార్జి కొమ్మవారి మస్తాన్, ఎమ్మార్పీఎస్‌ మాజీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు, మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం నాగరాజు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర నిర్వాహక ప్రధాన కార్యదర్శి బోరెల్లి వెంకటయ్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి, మాదిగ విద్యార్థుల సమాఖ్య వనపర్తి సహ ఇన్‌చార్జీలు మొలకలపల్లి పరశురాముడు, పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ అధ్యక్షుడు మీసాల గణేష్, మాదిగ విద్యార్థుల సమాఖ్య నాయకులు పుట్టపాగ అజయ్, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కొమ్ము గోపాల్, గంధం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.