చాగల్లులో పోషణ మాస ఉత్సవాలు.

చాగల్లులో పోషణ మాస ఉత్సవాలు.

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పోషణ మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యపై తల్లులకు అవగాహన కల్పించారు.
తల్లులు వివిధ రకాల బలవర్ధక, పోషకాహార వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరమని నిర్వాహకులు వివరించారు.కార్యక్రమంలో ఏసీడీపీవో శోభారాణి, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు అరుణ, తిరుమల, రమ, జయలక్ష్మి, మరియ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.