రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జీడీ ప్రీతీ .
అర్హత సాధించిన పదో తరగతి పల్లగుట్ట విద్యార్థిని .
చిల్పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జీడి ప్రీతి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్‌జూనియర్ బాలికల కబడ్డీ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రీతి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో ప్రీతి పాల్గొననుంది. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో తన ఆటతీరు, వేగం, పట్టుతో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్లంభట్ల విజయకుమార్ తెలిపారు.ప్రీతిని కబడ్డీలో తీర్చిదిద్దిన వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు జె. దేవ్‌సింగ్ రాథోడ్‌తో పాటు విద్యార్థినిని చిల్పూర్ గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, డైరెక్టర్ రత్నాకర్‌రెడ్డి, సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ, మండల అధ్యక్షుడు చిర్రా నాగరాజుగౌడ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రీతి ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.


Comments