ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
పెద్దమందడి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు)
ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ గ్రామంలోని 3వ, 4వ వార్డుల్లో పర్యటించారు. మార్నింగ్ వాక్ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.4వ వార్డులో చాలా కాలంగా సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన సర్పంచ్.. అవసరమైన ప్రాంతాల్లో త్వరలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామంలో వాహనాలు వేగంగా వెళ్తున్న ప్రాంతాల్లో వేగ నిరోధకాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, కొత్తగా నిర్మించనున్న మురుగునీటి కాలువల పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇళ్ల మధ్య పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించేందుకు వారం రోజుల పాటు యంత్రాన్ని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు చేపడతామని తెలిపారు.ప్రతి వార్డులో ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జజలి గణేష్, కావలి సరోజ ఉషయ్యతో పాటు బోయిన కృష్ణయ్య, కొత్తబండి జాజల, మేకల శివకుమార్, మకలి మొగులయ్య, పెంటల బాలయ్య, వెంకటయ్య, హరికృష్ణ, సవరయ్య, మకలి సత్తయ్య, పెంటయ్య, ముష్టి అశోక్, దాసరి రాజు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments