పలు కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ.

పలు కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ.

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు )

జిల్లాలో పలు కుటుంబాలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరామర్శించారు. తల్లాడ లో గువ్వల రామిరెడ్డి, గొల్లగూడెం గ్రామంలో గుండేటి కేశవరెడ్డి ఇటీవల మరణించగా.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటాల వద్ద మంత్రి నివాళులు అర్పించారు. అలాగే.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. *అనంతరం..ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాలో..* అజ్మీర వెంకన్న తల్లి సుక్కమ్మ ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులు అజ్మీర భాస్కర్, అజ్మీర కృష్ణలను పరామర్శించారు. 
*గోపిశెట్టికి పరామర్శ..:* కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురవగా.. తల్లాడ లోని వారి నివాసానికి వెళ్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య వివరాలు తెలుసుకుని.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
*ఈ కార్యక్రమాల్లో..:* టిపిసిసి ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి,  కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మువ్వా విజయబాబు, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు  గొడుగునూరి లక్ష్మారెడ్డి, ఫోట్రూ అర్జున్ రావు, తోట వీరభద్రం, జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు కాటేపల్లి కిరణ్, యాసా శ్రీకాంత్, పాపా నాయక్, పలువురు సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.