కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.

మొదటి 50 మంది టెస్ట్‌ డ్రైవ్‌దారుల్లో కిషోర్‌కు లక్కీ డ్రాలో బహుమతి.

కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.

సత్తుపల్లి, అక్టోబర్‌ 1 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి కమల్‌ మిత్ర మోటార్స్‌లో పల్సర్‌ 125, 150 కొత్త మోడళ్లను గురువారం ఆవిష్కరించారు. సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి బైక్‌లను ఆవిష్కరించగా.. కార్యక్రమంలో కమల్‌ మిత్ర మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ రహమత్‌ పాషా, మున్సిపల్‌ చైర్మన్‌ రెహనా బేగం కమల్‌ పాషా పాల్గొన్నారు. కొత్త పల్సర్‌ మోడళ్లు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అధునాతన సాంకేతిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చినట్లు మహమ్మద్‌ రహమత్‌ పాషా తెలిపారు. మోనోషాక్‌ సస్పెన్షన్‌, రైన్‌, స్పోర్ట్స్‌, రోడ్‌ మోడ్‌లతో కూడిన మూడు రైడింగ్‌ మోడ్‌లు, ఐదు అంగుళాల టీఎఫ్‌టీ కన్సోల్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, వినియోగదారులు షోరూమ్‌లో టెస్ట్‌ డ్రైవ్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. డౌన్‌ పేమెంట్‌ రూ.9,999 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. టెస్ట్‌ డ్రైవ్‌లో పాల్గొనే వినియోగదారులకు ప్రత్యేకంగా లక్కీ కూపన్‌ ద్వారా బహుమతులు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మొదటి 50 మంది టెస్ట్‌ డ్రైవ్‌దారులతో లక్కీ డ్రా నిర్వహించారు. సీఐ తుమ్మలపల్లి శ్రీహరి చేతుల మీదుగా నిర్వహించిన డ్రాలో పెనుబల్లికి చెందిన కుంటపత్తి కిషోర్‌ విజేతగా నిలిచారు. ఆయనకు కమల్‌ మిత్ర మోటార్స్‌ తరఫున ఆకర్షణీయమైన బహుమతిని అందజేశారు. కొత్త పల్సర్‌ మోడళ్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు టెస్ట్‌ డ్రైవ్‌ కోసం ఆసక్తి ఉన్నవారు షోరూమ్‌ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నకు ఘన సన్మానం.
పెద్దమందడి,అక్టోబరు01తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా (ఎంఈఓ) శాంతన్న బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు...
కమల్‌ మిత్ర మోటార్స్‌లో కొత్త పల్సర్‌ బైక్‌ల ఆవిష్కరణ.
గులాబీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.
తానేదార్‌పల్లిలో సామాజిక పటంతో ‘వీబీ జీ రామ్‌జీ’పై అవగాహన.
ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
సీఎం చొరవతోనే ఘనపూర్‌కు డిగ్రీ కళాశాల.