డబ్ల్యూపీఎల్ జేఏసీ కోశాధికారిగా మందపురం సతీష్.
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఉమ్మడి వరంగల్ ప్రైవేట్ లెక్చరర్ల జేఏసీ నూతన కార్యవర్గంలో కోశాధికారిగా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మందపురం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ లెక్చరర్ల ఐక్యత, సంక్షేమం కోసం ఏర్పాటైన డబ్ల్యూపీఎల్ జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికల్లో సతీష్‌ను కోశాధికారిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి ప్రైవేట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డబ్ల్యూపీఎల్ జేఏసీని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
మందపురం సతీష్ ప్రస్తుతం హనుమకొండలోని తేజస్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.


Comments