గాంధీజీ సిద్ధాంతాలే సమాజానికి మార్గదర్శకం.

గాంధీజీ సిద్ధాంతాలే సమాజానికి మార్గదర్శకం.

*సత్యం–అహింసే గాంధీజీ చూపిన మహోన్నత మార్గం*

*కరీంనగర్ నగరపాలక సంస్థలో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు*

*నివాళులర్పించిన మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు*

కరీంనగర్, అక్టోబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ):

 కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పలువురు అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మాగాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మాగాంధీ అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది మంది భారతీయుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.

సత్యం, అహింసలను శక్తివంతమైన ఆయుధాలుగా మలుచుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన పోరాటాన్ని మేయర్ గుర్తుచేశారు. రైతుల హక్కుల కోసం చంపారన్ సత్యాగ్రహం, బ్రిటిష్ వస్తువులు–సంస్థల బహిష్కరణకు సహాయ నిరాకరణ ఉద్యమం, బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ వంటి ఉద్యమాలు భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.

ప్రతి ఏటా గాంధీ జయంతిని అహింసా దినంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. గాంధీజీ ఆశయాలను నేటి, భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవరచుకోవాలని మేయర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహార్, ఏఈ సతీష్, క్యాషియర్ వెంకటేష్, ఉద్యోగులు అఖిల్, రాకేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.