పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ.

వెల్దూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్.

పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ.

వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పలువురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.అనంతరం పెద్దమందడి మండలం వెల్దూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద గొంది కృష్ణారెడ్డి, రేకులంపాటి అనూష, హోటల్ జయమ్మ, మనిగిళ్ల జ్యోతి, చాకలి నరసింహకు, కళ్యాణలక్ష్మి కింద మద్దూర్ లక్ష్మి–మద్దూర్ ఆంజనేయులు కుటుంబానికి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అందుబాటులో ఉంటూ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా తమ వంతు కృషి చేస్తామని ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మార్కెట్ యార్డు డైరెక్టర్ దిండు రవీందర్, డిఎస్ మహేష్, వడ్డె శేఖర్, దిండు వివేక్, కన్మనూర్ ప్రశాంత్ రెడ్డి , లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.