బతుకమ్మ బండ్‌తో గోపాలపూర్‌కు కొత్త అందాలు.

బతుకమ్మ బండ్‌తో గోపాలపూర్‌కు కొత్త అందాలు.

గోపాలపూర్, అక్టోబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలోని చిన్న చెరువు కట్ట వద్ద బతుకమ్మ బండ్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు బతుకమ్మ పండుగ వేడుకలకు అనువైన వేదికగా బండ్‌ను అభివృద్ధి చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో బతుకమ్మ బండ్ నిర్మాణానికి సహకరిస్తున్న దాత శ్రీ తుముల మాధవరావు (క్రషర్), సర్పంచ్ కర్రె లక్ష్మీ బిక్షపతి, ఉపసర్పంచ్ మారుపాక సందీప్, పంచాయతీ కార్యదర్శి గణపతి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోపాలపూర్ సర్పంచ్ కర్రె లక్ష్మీ బిక్షపతి మాట్లాడుతూ, బతుకమ్మ బండ్ నిర్మాణంతో గ్రామానికి కొత్త అందాలు సంతరించుకుంటాయని అన్నారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. బతుకమ్మ బండ్ నిర్మాణానికి సహకరిస్తున్న దాత తుముల మాధవరావుకుIMG-20261002-WA0019 గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బతుకమ్మ బండ్ నిర్మాణాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.