నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జబ్బార్, మాదిగ మేధావుల సమాఖ్య జాతీయ కోర్ కమిటీ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు పుస్తక భవన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా పుస్తక భవన్‌లో అందుబాటులో ఉంచిన వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగార్థులు, సాధారణ పాఠకులకు ఉపయోగపడే విజ్ఞానదాయకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు, పెద్దలు, ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థులకు సైతం ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.విద్యార్థుల్లో పఠనాసక్తిని, విజ్ఞానాన్ని పెంపొందించడంలో పుస్తక భవనాలు, పుస్తక ప్రదర్శన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించి తమకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.